రక్షణ రంగంలో 100% ఎఫ్డీఐలకు ఓకే!

30 May, 2014 10:54 IST|Sakshi

రక్షణ రంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) ప్రతిపాదిస్తూ వచ్చిన కేబినెట్ నోట్కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రక్షణ రంగంలో ఎఫ్డీఐల పరిమితి 26 శాతం మాత్రమే.

యూపీఏ హయాంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ.. ఇలా రక్షణరంగంలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మల్టీబ్రాండ్ రీటైల్లో ఎఫ్డీఐలను అనుమతించేది లేదని మొదటిరోజే చెప్పిన నిర్మల.. ఇప్పుడు రక్షణ రంగానికి మాత్రం ఆ సూత్రం వర్తింపజేయలేదు.

మరిన్ని వార్తలు