వీరభద్ర సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

29 Mar, 2016 14:04 IST|Sakshi

న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను అరెస్ట్ చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వీరభద్ర సింగ్ రూ.6.57 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు ఈడీ ఆరోపించింది. ఇప్పటికే ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఫోర్జరీ నేరం కింద ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. వీరభద్ర సింగ్, ఆయన అనుచరులపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

వీరభద్ర సింగ్ అరెస్టైతే ఉత్తరాఖండ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. తనచుట్టూ ఉచ్చు బిగుస్తుండడంతో వీరభద్ర సింగ్ హైకమాండ్ ను ఆశ్రయించారు. సోమవారం ఆయన సోనియా గాంధీని కలిశారు. తనపై వచ్చిన ఆరోపణలపై 'మేడమ్'కు వివరణయిచ్చారు.

మరిన్ని వార్తలు