దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

21 Oct, 2016 11:43 IST|Sakshi
దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్టిస్టులు నటించిన సినిమాల వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు, ఆర్టిస్టులకు తన మద్దతు కచ్చితంగా ఉంటుందని ట్వీట్ చేసిన దిగ్విజయ్.. కేవలం పాక్ ఆర్టిస్టులను మాత్రమే ఎందుకు నిషేధిస్తున్నారని ప్రశ్నించారు. అంతగా అవసరమైతే దాయాది పాక్ ను అన్నిరంగాల్లోనూ నిషేధిస్తే తప్పేముంది అని మరో ప్రశ్న సంధించారు. ఇరుదేశాల మధ్య ఎన్నో సమస్యలు ఉండగా కేవలం పాక్ ఆర్టిస్టులు మాత్రమే ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

భారత్-పాక్ దేశాలకు ఆర్టిస్టులే బాండ్ అంబాసిడర్లు అని వారిని కొనియాడారు. పాకిస్తాన్ తో భారతీయులకు నేరుగా సంబంధాలు లేని పక్షంలో నిషేధం లాంటివి వాడాలి, అలా కాని పక్షంలో ఆర్టిస్టులు లేదా ఇతర రంగాలకు చెందిన వారిపై నిషేధం విధించడం ఉత్తమమని దిగ్విజయ్ వరుస ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్న చాలా మందితో పాటు రాజకీయ నాయకులు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా వివాదం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ వద్దకు తీసుకెళ్లగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మూవీ రిలీజ్ అవుతుందని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు