'తిరస్కరణ ఓటు' ఉండాల్సిందే: అద్వానీ

6 Oct, 2013 18:55 IST|Sakshi
'తిరస్కరణ ఓటు' ఉండాల్సిందే: అద్వానీ

ఎన్నికల్లో అభ్యర్థులను తిరస్కరించే అవకాశాన్నిఓటర్లకు కల్పిస్తూ ఈవీఎంలలో తప్పనిసరిగా నెగిటివ్ ఓటు బటన్ ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ స్వాగతించారు. అభ్యర్థులందరూ సచ్ఛీలురుకారని ఓటరు భావిస్తే నెగిటివ్ ఓటు తిరస్కరించే అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.
 
ఓటర్లకిది విలువైన హక్కని అద్వానీ తన బ్లాగ్లో రాసుకున్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో తొలిసారిగా నెగిటివ్ ఓటు అవకాశాన్ని కల్పించనున్నారు. కాగా పౌరులందరూ తప్పనిసరి ఓటు వేసేలా నిబంధన తీసుకురావాలని అద్వానీ అభిప్రాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు