11 నెలల చిన్నారి అవయవదానం

13 Jul, 2018 02:02 IST|Sakshi

చండీగఢ్‌: చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) వైద్యులు అరుదైన ఆపరేషన్‌ చేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో బతికే అవకాశంలేని 11 నెలల చిన్నారి కిడ్నీలను ఓ వ్యక్తికి అమర్చారు. నేపాల్‌కు చెందిన దంపతులు 11 నెలల వయసున్న తమ బాబుతో కలసి చండీగఢ్‌లో ఉంటున్నారు.

జూలై 6న పిల్లాడు ఊయల నుంచి కిందపడడంతో తలకు దెబ్బతగిలి స్పృహ కోల్పోయాడు. చికిత్స కోసం పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. పిల్లాడు బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. తల్లిదండ్రుల అంగీకారంతో పిల్లాడి 2 కిడ్నీలను మరో వ్యక్తికి ఆపరేషన్‌చేసి అమర్చారు. ఆస్పత్రి చరిత్రలో అవయవదానం చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా ఈ పిల్లాడు నిలిచాడు. కిడ్నీలను చిన్నారులకే అమర్చాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఓ రోగితో బాలుడి కిడ్నీలు మ్యాచ్‌ కావడంతో ఆ వ్యక్తికే అమర్చారు.

మరిన్ని వార్తలు