ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

10 Feb, 2020 15:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణకు గత ఆరేళ్లలో ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూగా ఉన్న రాష్ట్రం ఆ తర్వాత వరుసగా అప్పులు పెరిగాయని అందులో పేర్కొన్నారు.

వివరాలు..
1. ఆరేళ్లలో పన్ను వాటా కింద తెలంగాణకు రూ. 85,013 కోట్లు కేంద్రం విడుదల.
2. రాషష్టట్రాల విపత్తుల కింద రూ. 128.94 కోట్లు విడుదల.
3. స్థానిక సంస్థల నిధుల కింద రూ. 6511 కోట్లు విడుదల.
4. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ. 1916 కోట్లు కేంద్రం జారీ.
5. గ్రామీణాబివృద్ధిశాఖ నుంచి రూ. 3853 కోట్లు కోట్లు విడుదల.
6. కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు ఇన్‌ అయిడ్‌ కింద రూ. 51,298.84 కోట్లు విడుదల. 
7. మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి రూ. 1500.54 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంతత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు