‘ప్రధాని ఎక్కడ?.. రమ్మనండి’

17 Nov, 2016 12:03 IST|Sakshi
‘ప్రధాని ఎక్కడ?.. రమ్మనండి’

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితిల్లో చర్చ చేపట్టాల్సిందేనని, ఇంత సున్నితమైన సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు ప్రధాని మోదీ సభకు హాజరుకాల్సిందేనని, చర్చలో పాల్గొని సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత దిరేక్ ఓబ్రియెన్ మాట్లాడుతూ ‘సభకు ప్రధాని రావాలి. చర్చలో మేం ఏం చెప్తున్నామో వినాలి. ఒక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే సరిపోదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఓటింగ్ కూడా నిర్వహించాలి’  అని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు నోట్ల రద్దుపై చర్చ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.

>
మరిన్ని వార్తలు