తలాఖ్‌ తీర్పు చాలా స్పష్టంగా ఉంది

24 Aug, 2017 14:48 IST|Sakshi
తలాఖ్‌ తీర్పు చాలా స్పష్టంగా ఉంది
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్‌ తలాఖ్‌ కు ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకమన్న సుప్రీం కోర్టు ఆరు నెలలో అందుకు అవసరమైన చట్టం చేయాలంటూ పార్లమెంట్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయితే ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పు కాపీలో స్పష్టత కొరవడిందంటూ సీనియర్‌​ న్యాయవాది కపిల్‌ సిబల్‌ గురువారం మరోసారి అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు. 
 
ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తరపున వాదనలు వినిపించిన సిబల్‌ తీర్పు కాపీలోని చివరి పేజీ(395వ) ప్రతిని సమర్పించి తీర్పుపై స్ఫష్టత కోరారు. బెంచ్‌ లోని మెజార్టీ సభ్యుల అభిప్రాయం విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు.  అయితే తామిచ్చిన తీర్పు చాలా స్ఫష్టంగా ఉందని, ఎలాంటి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి ఖేహర్‌ బదులిచ్చారు. ఒకవేళ దీనిపై మరింత వివరణ కావాలంటే మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చంటూ సిబల్‌ కు సూచించింది. 
 
ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో 3;2 నిష్పత్తిలో ట్రిపుల్‌ తలాఖ్‌ పై తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి ఖేహర్‌తోపాటు మరో జడ్జి నజీర్‌ అది ప్రాథమిక హక్కేనని తేల్చగా, మిగతా ముగ్గురు జడ్జిలు జోసెఫ్‌, నారీమన్‌, లలిత్‌ లు మాత్రం ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకమంటూ అభిప్రాయం వెలిబుచ్చారు.
మరిన్ని వార్తలు