తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత

27 Sep, 2014 11:48 IST|Sakshi
తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత

ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరింనున్న నేపథ్యంతో ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రెండు రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోసూరు ప్రాంతంలో డీఎంకే- అన్నా డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇక తీర్పు నేపథ్యంలో డీఎంకే నాయకుడు స్టాలిన్.. తన తండ్రి కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. తీర్పు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న అంశంపై ఆయన తండ్రితో చర్చించారు.

తమిళనాడులోని అన్ని పార్టీల కార్యాలయాల్లో ఉన్న నేతలంతా తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దాదాపు లక్ష మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు కోసం తమిళనాడు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. పటిష్ఠమైన బందోబస్తు మధ్య బెంగళూరులోని ఓ జైల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు  జయలలిత చేరుకున్నారు.

>
మరిన్ని వార్తలు