మిజోరంలో ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్‌

30 Apr, 2018 03:22 IST|Sakshi

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల్లో ప్రధాన వైరి పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చక్మా అటానమస్‌ డిస్ట్రిక్‌ కౌన్సిల్‌(సీఏడీసీ)ను పాలించేందుకు ఒక్కటయ్యాయి. 20 స్థానాలున్న సీఏడీసీకి ఏప్రిల్‌ 20న జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) 8 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్‌ 6 సీట్లు, బీజేపీ ఐదు సీట్లలో గెలుపొందాయి.

కాగా, ఫుటులి సీటుకు జరిగిన ఎన్నికల ఫలితాలపై గౌహతి హైకోర్టు స్టే విధించడంతో ఫలితాలను వెల్లడించలేదు.  సీఏడీసీలో ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడిగా తమకు చోటివ్వడానికి ఎంఎన్‌ఎఫ్‌ నిరాకరించడంతోనే కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్లు బీజేపీ నేత ఒకరు తెలిపారు. తాజాగా కాంగ్రెస్‌ మద్దతుతో సీఏడీసీ పాలనను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై ఇరుపార్టీలు ఏప్రిల్‌ 25న ఓ అంగీకారానికి వచ్చాయన్నారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నిర్భయ్‌ శర్మతో సమావేశమై సీఏడీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు