మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌: ఇప్పటి వరకు ఎంత శాతమంటే? | Mizoram And Chhattisgarh Assembly Elections 2023 Polling Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

Published Tue, Nov 7 2023 6:57 AM

Mizoram And Chhattisgarh Assembly Elections Live Updates - Sakshi

Updates..

మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది..

11 గంటల వరకు పోలింగ్‌ ఇలా..
►ఛత్తీస్‌గఢ్‌లో 22.97 శాతం పోలింగ్‌
►మిజోరంలో 26.43 శాతం పోలింగ్‌ నమోదు 

ప్రజల కోసమే కాంగ్రెస్‌..
►ఎన్నికల పోలింగ్‌ సందర్బంగా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లలో మేం చేసిన పనితో నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.. ప్రజలు తమ గ్రామంలోనే ఓటు వేస్తారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీటన్నింటి ప్రస్తావన ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. 

ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్‌ ఇలా..
►ఛత్తీస్‌గఢ్‌లో 9.93 శాతం
►మిజోరంలో 12.80 శాతం పోలింగ్‌ నమోదు 

23ఏళ్ల తర్వాత పోలింగ్‌
►సుక్మాలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. సీఆర్‌పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా బలగాల భద్రతతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

► ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.

►ఓటు వేసిన మిజోరం గవర్నర్‌ హరిబాబు కంభంపాటి. ఐజ్వాల్‌లోని సౌత్‌-2 పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. 

ఈ సందర్బంగా గవర్నర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ.. మిజోరం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. ప్రజలు కూడా తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మిజోరంలో  ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుందని నేను భావిస్తున్నాను.

►ఓటు వేసిన మిజోరం కాంగ్రెస్‌ చీఫ్‌ లాల్‌సావ్‌తా ఓటు వేశారు. ఐజ్వాల్‌లోని మిషన్‌ వెంగ్‌తలాంగ్‌ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి కేదార్‌ కశ్యప్‌
►ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణపూర్‌ బీజేపీ అభ్యర్థి కేదార్‌ కశ్యప్‌.. భాన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ 212లో ఓటు వేశారు. 

►ఈ సందర్భంగా కేదార్‌ కశ్యప్‌ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

►ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిజోరంలో హంగ్‌ వచ్చే ప్రసక్తే లేదు. ఇక్క ఎంఎన్‌ఎఫ్‌ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మెజార్టీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిజోరంలో మేము చాలా అభివృద్ధి పనులు చేశాం. నేను ఓటు వేసిన సందర్బంగా ఈవీఎం పనిచేయలేదు. నేను కాసేపట్లో మళ్లీ ఓటు వేస్తాను. మిజోరంలో మ్యాజిక్‌ ఫిగర్‌ 21. కానీ, 25 స్థానాల్లో మేము గెలుస్తాం. 

►ఈ క్రమంలో ఈవీఎం మొరాయించడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. 

►ఓటు వేసిన మిజోరం సీఎం జోరంతంగా


►మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐజ్వాల్‌ వెంగలై-1 ఐఎంఏ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. 

►మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్‌ ప్రారంభమైంది. 

►మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) మధూప్‌ వ్యాస్‌ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.

►149 పోలింగ్‌ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు.

►ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనుంది. తొలి దశలో పోలింగ్‌ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్‌ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

►మొత్తం 5,304 పోలింగ్‌ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్‌)లున్నాయి.  

►తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ రమణ్‌సింగ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్‌ బైజ్‌లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్‌నంద్‌గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్‌కాల్, నారాయణ్‌పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.  

►రాజ్‌నంద్‌గావ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్‌సింగ్, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గిరీష్‌ దేవాంగన్‌ల మధ్య నెలకొంది. రాజ్‌నంద్‌గావ్‌ అసెంబ్లీ సీటు రమణ్‌ సింగ్‌కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి  గెలుపొందారు. రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్‌  సీనియర్‌ నేత గిరీష్‌ దేవాంగన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్‌ బైజ్‌ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్‌ గోపాల్‌ దీపక్‌కు సవాల్‌ విసిరారు.

Advertisement
Advertisement