టాప్‌ 50లోకి భారత్‌  

18 Jan, 2019 20:52 IST|Sakshi

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ

గాంధీనగర్‌: వచ్చే ఏడాది నాటికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మన దేశం 50వ ర్యాంకుకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ తొమ్మిదో సదస్సులో శుక్రవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ బ్యాంకు..ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మన దేశం 75 ర్యాంకులను అధిగమించిందని తెలిపారు. ‘వచ్చే ఏడాదికల్లా 50వ ర్యాంకుకు చేరుకోవడం కోసం రేయింబవళ్లు కష్టపడాల్సిందిగా నా బృందానికి సూచించా. వ్యాపారానికి సంబంధించి నిబంధనలతోపాటు ప్రక్రియ కూడా మరింత సరళంగా ఉండాలని, తక్కువ వ్యయంతో పూర్తయ్యేలా ఉండాలనేదే నా అభిమతం’ అని అన్నారు. శక్తిసామర్థ్యాలమేరకు భారత్‌ ఎదిగేందుకు ఏవి ప్రతిబంధకాలుగా ఉన్నాయో వాటిని తొలగించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. 

సంస్కరణలతో ముందుకు...
సంస్కరణలు, సడలింపులతో ముందుకు సాగుతామన్నారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం, పన్నులను ఏకీకృతం చేయడం,లావాదేవీలను సరళతరం చేయడం వంటి చర్యలతో ప్రక్రియ మరింత సమర్థమంతమైందన్నారు. డిజిటలీకరణ, ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మరింత వేగవంతమైందన్నారు. ఐటీ కొనుగోళ్లలో ఆధారిత లావాదేవీలు, డిజిటల్‌ చెల్లి ంపులు కూడా ప్రపంచ దేశాల్లో మన ర్యాంకు పెరిగేందుకు దోహదపడిందని ఆయన వివరించారు. 

మరిన్ని వార్తలు