డివిలియర్స్ అరుదైన రికార్డు

27 Dec, 2014 00:18 IST|Sakshi
డివిలియర్స్ అరుదైన రికార్డు

పోర్ట్ ఎలిజబెత్: విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సఫారీ జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ బరిలోకి దిగాడు.
 
 ఈ మ్యాచ్ తనకు 97వది కావడం విశేషం. గతంలో ఇలా ఎలాంటి బ్రేక్ లేకుండా ఆడిన రికార్డు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (96) పేరిట ఉంది. ప్రస్తుతం ఆ రికార్డును డివిలియర్స్ బద్దలుకొట్టాడు.
 

మరిన్ని వార్తలు