మా ఫీల్డర్లే గెలిపిస్తారు

15 Sep, 2017 00:55 IST|Sakshi
మా ఫీల్డర్లే గెలిపిస్తారు

ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ హెడ్‌ ధీమా  

చెన్నై: తమ జట్టులో అత్యంత నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారని, వారే భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జట్టు విజయానికి కారణమవుతారని ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ట్రెవిస్‌ హెడ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఓ మ్యాచ్‌ గెలవాలన్నా.. ఓడాలన్నా ఫీల్డింగే కారణమవుతుంది. అయితే ఈ విషయంలో మా జట్టు గర్వపడాల్సి ఉంది. ఎందుకంటే అద్భుతమైన ఫీల్డింగ్‌ మా సొంతం. ఈ విషయంలో మేం చాలా కష్టపడ్డాం. తమ ఫీల్డింగ్‌తో జట్టును గెలిపించే వారు మా జట్టులో ఉన్నారు’ అని హెడ్‌ అన్నాడు.

ఫించ్‌ అనుమానమే...
ఆసీస్‌ పించ్‌ హిట్టర్‌ ఆరోన్‌ ఫించ్‌ తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది. అతడి కాలి పిక్క కండరాల నొప్పి ఎక్కువ కావడమే ఇందుకు కారణం. నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలో తను గాయపడటంతో సెషన్‌కు దూరంగా ఉంచి విశ్రాంతి కల్పించారు. ఒకవేళ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే హెడ్‌ లేదా కార్ట్‌రైట్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు