అవినీతి లేని క్రికెట్ సాధ్యం కాదు:సల్మాన్

18 Dec, 2016 13:06 IST|Sakshi
అవినీతి లేని క్రికెట్ సాధ్యం కాదు:సల్మాన్

కరాచీ: ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవినీతి లేని క్రికెట్ కోసం తీవ్రంగా యత్నిస్తుంటే, మరొకవైపు అవినీతి క్రికెట్ సాధ్యం కాదని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. అవినీతిపై ఐసీసీ పోరాటాన్ని ఆహ్వానించిన సల్మాన్.. పూర్తిస్థాయిలో అవినీతిని అరికట్టడం అంత సులువు కాదన్నాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో  ఇరుక్కున్న సల్మాన్.. దాదాపు ఐదు సంవత్సరాలు నిషేధం ఎదుర్కొన్నాడు. 2015లో అతనిపై విధించిన నిషేధాన్ని తొలగించడంతో మరొకసారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సల్మాన్ యత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన సల్మాన్.. క్రికెట్లో అవినీతిని నిర్మూలించడానికి ఐసీసీ చేపట్టిన విన్నూత్న పద్ధతులను కొనియాడాడు. 

 

'క్రికెట్ లో తరచు వెలుగు చూస్తున్న అవినీతిపై ఐసీసీ పోరాటానికి సిద్ధం కావడం నిజంగా అభినందనీయం. కాకపోతే పూర్తిస్థాయి అవినీతి నిర్మూలన అనేది సాధ్యం కాదనేది నా భావన. ఈ విషయాన్ని నేనే స్వీయ అనుభవంతో తెలుసుకున్నాను. ఏదొక సందర్భంలో మన బలహీనతతో అవినీతికి పాల్పడుతూ ఉంటాం. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు గేమ్ను పూర్తిగా ప్రక్షాళన చేయలేవు'అని సల్మాన్ భట్ అన్నాడు.


క్రీడల్లో అవినీతిని నిర్మూలించడానికి తాను ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన విషయాన్ని సల్మాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇదొక తన కెరీర్లో ఎదురైన ప్రత్యేక అనుభవమన్నాడు.తాను స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన తరువాత తీవ్రమైన మనోవ్యథకు గురైనట్లు తెలిపాడు. తనకు ఒక ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని చాలాసార్లు వేడుకున్నానని, తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి సత్తా చాటుకుంటానన్నాడు. పాకిస్తాన్ కు ఆడటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని సల్మాన్ తెలిపాడు.

మరిన్ని వార్తలు