'సిక్సర' పిడుగు

12 Mar, 2015 17:47 IST|Sakshi
'సిక్సర' పిడుగు

వెల్లింగ్టన్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డుల మోత కొనసాగుతోంది. ఈ విధ్వంసక బ్యాట్స్ మన్ మరో రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్ లో అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 20 సిక్సర్లతో 'సిక్సర' పిడుగు అనిపించుకున్నాడు. 18 సిక్సర్లతో 2007లో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్  నెలకొల్పిన రికార్డును డివిలియర్స్  అధిగమించాడు. తాజా ప్రపంచకప్ లో క్రిస్ గేల్ కూడా 18  సిక్సర్లు బాదాడు.

యూఏఈతో జరుగుతున్న మ్యాచ్ లో 82 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్ లో 99 పరుగుల వద్ద అవుటైన మూడో బ్యాట్స్ మన్ డివిలియర్స్ నిలిచాడు. ఇంతకుముందు గిల్ క్రిస్ట్(2003), డుమిని(2011) ఒక్క పరుగు తేడాతో సెంచరీలు కోల్పోయారు.

ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్(1,142 పరుగులు) ఏడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 2,278 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో డివిలియర్స్ 417 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

>
మరిన్ని వార్తలు