మీరు ఎలా విమర్శిస్తారు?: గవాస్కర్

26 Nov, 2015 21:01 IST|Sakshi
మీరు ఎలా విమర్శిస్తారు?: గవాస్కర్

నాగ్ పూర్:భారత దేశ క్రికెట్ పిచ్ లను విమర్శించేవారు ముందు వారి దేశాల్లో పిచ్ లు గురించి మాట్లాడితే బాగుంటుందని మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ హితవు పలికాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తాజా టెస్టు సిరీస్ లో తయారు చేసిన పిచ్ లు అత్యంత క్రూరమైనవిగా అభివర్ణించిన మైకేల్ వాన్, మాథ్యూ హేడెన్, వసీం అక్రమ్, డేవిడ్ లాయిడ్ తదితరుల వ్యాఖ్యలపై  గవాస్కర్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. భారత్ లో పిచ్ లు స్పిన్ ను సహజసిద్ధంగా పోలి ఉంటుందన్న విషయం ప్రతీ ఒక్కరూ గ్రహిస్తే బాగుంటుదన్నాడు. ఎక్కడో పది వేల మైళ్ల దూరంలో కూర్చొని ఈ తరహా కామెంట్లు చేయడం మంచిది కాదన్నాడు.  బ్యాటింగ్ పేలవంగా ఉన్నప్పుడు పిచ్ ను నిందించడం ఎంతవరకూ సమంజసమన్నాడు. ఐదు నుంచి పది ఓవర్లు చూసి పిచ్ లను అంచనా వేయడం కరెక్ట్ కాదన్నాడు.

 

ఇంగ్లండ్ తదితర దేశాల్లో రెండు, మూడు రోజుల్లో ముగుస్తున్న మ్యాచ్ లు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆ మాజీలను గవాస్కర్ ప్రశ్నించాడు. అసలు ఏదో భూతం పిచ్ లో లేదని.. బ్యాట్స్ మెన్ మనసుల్లో ఉందని గవాస్కర్ తెలిపాడు. నాగ్ పూర్ తరహా పిచ్ ల వల్ల క్రికెటర్ జీవితానికి ఏమీ ఉండదని.. విదేశాల్లో కొన్ని పిచ్ ల్లో ఆడటం కొన్ని సందర్భాల్లో క్రికెటర్లకు ప్రమాదకరంగా మారతాయన్నాడు. తొలుత పిచ్ లు గురించి పూర్తిగా పరిశీలించిన తరువాత మాట్లాడితే బాగుంటుందన్నాడు. ఐదు నుంచి పది, ఇరవై టెస్టులు ఆడి అనవసర వ్యాఖ్యాలు చేసి మాజీలకు ఇదే తన సమాధానమని గవాస్కర్ తెలిపాడు.

మరిన్ని వార్తలు