అంతకంటే నీచం లేదు: బోల్ట్

2 Aug, 2017 12:38 IST|Sakshi
అంతకంటే నీచం లేదు: బోల్ట్

లండన్:డోపింగ్ పాల్పడే అథ్లెట్లపై జమైకా స్ర్పింటర్ ఉసేన్ బోల్ట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.  డోపింగ్ కు పాల్పడటమంటే ఆ క్రీడను నాశనం చేయడమనే విషయాన్ని వారు తెలుసుకోవాలని హితబోధ చేశాడు. డోపింగ్ కు పాల్పడటం కంటే నీచమైనది ఏదీ లేదని, దాన్ని ఆపితేనే గేమ్ ను బతుకుతుందన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో భాగంగా రెండు విభాగాల్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన బోల్డ్.. డోపింగ్ అనేది క్రీడకు ఎంతమాత్రం మంచికాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నాడు.

 

'డోపింగ్ ను ఆపాలి. అప్పుడే క్రీడలకు సాయం చేసిన వారమవుతాం. డోపింగ్ కు పాల్పడటం కంటే నీచమైనది ఏదీ లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ డోపింగ్ పాల్పడితే మాత్రం మన చేతులతోనే ఆయా క్రీడల్ని నాశనం చేసుకున్నట్లవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలని అథ్లెట్లకు సూచిస్తున్నా. మోసం చేయాలనే ప్రయత్నిస్తే ఏదొక రోజు మనం దొరక్కతప్పదు'అని బోల్డ్ హెచ్చరించాడు. శుక్రవారం నుంచి ఆరంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో బోల్ట్ 100 మీటర్లు,4x100 మీటర్ల రేసులో పాల్గొనున్నాడు. ఈ చాంపియన్ షిప్ తరువాత బోల్ట్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు.
 

మరిన్ని వార్తలు