బ్రిటన్‌లో 'తొలి గులాబి' మ్యాచ్

7 Oct, 2016 10:17 IST|Sakshi
బ్రిటన్‌లో 'తొలి గులాబి' మ్యాచ్

లండన్: క్రికెట్ పుట్టినిళ్లుగా పేరున్న బ్రిటన్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్కు వేధికను ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఎడ్గ్‌బాస్టన్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ను నిర్వహించనున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌తో తలపడనుంది.  అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గత ఏడాది జరిగింది. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన టెస్ట్‌గా ఆ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను తొలిసారి వాడారు. కాగా, వచ్చే వారంలో పాకిస్తాన్, వెస్టిండిస్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడునుంది. దీంతో డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చిన దేశాల్లో మూడో స్థానంలో బ్రిటన్ నిలువనుంది.


పగలు పని చేసేవారు కూడా టెస్ట్ మ్యాచ్‌లను వీక్షిండానికి ప్రోత్సాహం కల్పించడమే తమ లక్ష్యం అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది  ఆగష్టు17-22 మధ్య జరిగే మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో వెస్టిండిస్‌తో తలపడనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు