ఇంగ్లండ్ భయం రెట్టింపయింది!

21 Jul, 2016 12:07 IST|Sakshi
ఇంగ్లండ్ భయం రెట్టింపయింది!

మాంచెస్టర్: నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లో 75 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. ముఖ్యంగా తమ ఆటగాళ్లు స్పిన్నర్ల బౌలింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటుందని గమనించి ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పాక్ స్పిన్ లెజెండ్ సక్లయిన్ ముస్తాక్ సేవలను వినియోగించుకోనుంది. తమ స్పిన్నర్లకు తాత్కాలికంగా కోచింగ్ కన్సల్టెంట్ గా పనిచేయాలని ఇంగ్లండ్ ఆహ్వానం పంపింది.

తొలి టెస్టు జరిగిన లార్డ్స్ మైదానంలోనే పాక్ స్పిన్నర్ యాసిర్ షా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ వెన్నువిరిచిన విషయం తెలిసిందే. అయితే రేపు (శుక్రవారం) ఓల్డ్ ట్రాఫోర్డ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఈ మ్యాచులోనూ యాసిర్ చెలరేగితే పరిస్థితి ఏంటని ఇంగ్లండ్ ఆందోళన చెందుతోంది. దీంతో తమ స్పిన్ విభాగంలో మొయిన్ అలీ స్థానంలో కొత్త బౌలర్ అదిల్ రశీద్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా ఉన్నందున తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ తుదిజట్టులో చోటు దక్కితే స్వదేశంలోనే టెస్ట్ అరంగేట్రం చేసిన బౌలర్ కానున్నాడు లెగ్ స్పిన్నర్ రశీద్. 2014 లో పాక్ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ బౌలింగ్ కోచ్ గా వైదొలిగిన తర్వాత మరో వ్యక్తికి ఇంగ్లండ్ బాధ్యతలు అప్పగించలేదు.

>
మరిన్ని వార్తలు