'బాధ్యతల నుంచి తప్పించుకోను'

17 Jul, 2017 11:46 IST|Sakshi
'బాధ్యతల నుంచి తప్పించుకోను'

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా భారత క్రికెట్ కు దూరమైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తన రీ ఎంట్రీపై స్పందించారు. భారత క్రికెట్ తన సేవలు అవసరమని కోరితే అందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తనది బాధ్యతల్ని నుంచి తప్పించుకునే మనస్తత్వం కాదని ఈ సందర్భంగా అనురాగ్ పేర్కొన్నారు. 'బాధ్యతల్ని తప్పించుకోను.నా అవసరం ఉందని భారత క్రికెట్ గుర్తిస్తే బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా'అని అనురాగ్ తన మనసులో మాట వెల్లడించారు.

'అనురాగ్ మళ్లీ భారత్ క్రికెట్ లోకి రావాలి. అతని అవసరం భారత్ క్రికెట్ కు ఉంది'అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇటీవల గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అనురాగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ క్రమంలోనే గంగూలీ సోషల్ మీడియా ద్వారా అనురాగ్ తిరిగి భారత్ క్రికెట్ లోకి రావాలన్నారు.

గత ఆరు నెలల క్రితం లోధా కమిటీ సిఫారుసుల అమలుకు సంబంధించి నాన్చుడి ధోరణి అవలంభించిన అనురాగ్ తన అధ్యక్ష పదవిని కోల్పోయారు. మరొకవైపు అబద్ధపు ప్రమాణం చేసి కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం అనురాగ్ నేరుగా సుప్రీంకోర్టుకు హాజరై కోర్టు ఉల్లంఘనకు సంబంధించి క్షమాపణ తెలియజేయడంతో ఆ కేసు నుంచి విముక్తి పొందారు.

 

మరిన్ని వార్తలు