జపాన్‌ చేతిలో భారత్‌ పరాజయం

21 Jul, 2017 01:41 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నీ వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 0–2 గోల్స్‌ తేడాతో జపాన్‌ చేతిలో ఓడిపోయింది. 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చెందడంతో... ఇక శనివారం ఐర్లాండ్‌తో 7–8 స్థానాల కోసం తలపడుతుంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ దూకుడుగా ఆడినా అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మల్చుకోవడంలో విఫలమైంది.

మరోవైపు జపాన్‌కు 7వ నిమిషంలో కానా నొమురా, 29వ నిమిషంలో నహో ఇచితాని ఒక్కో గోల్‌ అందించారు. భారత్‌కు తొలి పెనాల్టీ కార్నర్‌ 51వ నిమిషంలో లభించగా... గుర్జీత్‌ కౌర్‌ కొట్టిన షాట్‌ను జపాన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకుంది. జపాన్‌కు పది పెనాల్టీ కార్నర్‌లు లభించగా, రెండింటిని గోల్స్‌గా మలిచింది.  

మరిన్ని వార్తలు