శాఫ్ క్రీడల్లో భారత్ విజయభేరి

6 Feb, 2016 11:44 IST|Sakshi

గువాహటి: దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మణిపూర్ మహిళలు సైక్లింగ్ లో తమ సత్తా చాటుకున్నారు. శనివారం ప్రారంభమైన మహిళల 30 కిలోమీటర్ల సైక్లింగ్ విభాగంలో మణిపూర్ కు చెందిన సైక్లిస్ట్ టీ విజయలక్ష్మీ బంగారు పతకాన్ని సాధించింది. తద్వారా 12వ శాఫ్ గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డు నమోదుచేసింది. ఈ గేమ్స్ ఆరంభ వేడుకలను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

30 కిలోమీటర్ల మహిళల సైక్లింగ్ విభాగంలో 49 నిమిషాల 24 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజయలక్ష్మీ తొలి స్థానంలో నిలిచింది. మణిపూర్ కే చెందిన మరో సైక్లిస్ట్ ఛోబా దేవి శనివారం జరిగిన ఫైనల్స్ లో 49 నిమిషాల 31 సెకన్లలో టార్గెట్ చేరుకుని రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకుంది. మణిపూర్ వనితలు సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మొత్తంగా రెండు పతకాలు చేరాయి.

మరిన్ని వార్తలు