భారత్-విండీస్ మ్యాచ్ హైలైట్స్

1 Apr, 2016 11:54 IST|Sakshi
భారత్-విండీస్ మ్యాచ్ హైలైట్స్

ముంబై: టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమీండియాపై విండీస్ టీమ్ పైచేయి సాధించి తుది సమరానికి అర్హత సాధించింది. భారత్-విండీస్ మ్యాచ్ తో పాటు, ఈ వరల్డ్ కప్ లోని కొన్ని విశేషాలు గురించి తెలుసుకుందాం.

 • ఈ టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచుల్లో టాస్ ఓడినప్పటికీ విజయాలు నమోదు చేసింది.

   
 • టాప్-3 బ్యాట్స్ మన్లు 40 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది మూడోసారి. 2013లో న్యూజిలాండ్-ఇంగ్లండ్, 2016లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచుల్లో ఈ ఫీట్ నమోదైంది.
   
 • ఈ టీ20 ప్రపంచకప్ లో వాంఖెడే స్టేడియంలో 5 మ్యాచ్ లు జరగ్గా నాలుగుసార్లు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ నాలుగుసార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.
   
 • అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలులు సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. 16 అర్ధసెంచరీలతో టాప్ లో నిలిచాడు.
   
 • టీ20ల్లో ఫస్ట్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు 35.22. ఛేజింగుల్లో అతడి బ్యాటింగ్ యావరేజ్ 91.80
   
 • వాంఖెడే స్టేడియంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 37.67. అంతకుముందు 39 ఇన్నింగ్స్ లో 135.97 స్ట్రైక్ రేటుతో 1168 పరుగులు చేశాడు.
   
 • పవర్ ప్లేలో 55 పరుగులు చేసింది. టీ20 పవర్ ప్లేలో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లే ఆడడం కూడా ఇదే మొదటిసారి.
   
 • టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా వెస్టిండీస్ (193) గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా (192; 2010లో పాక్‌పై) పేరిట ఉండేది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా