రూ.14 కోట్లకు న్యాయం చేశాడు: స్మిత్

2 May, 2017 17:21 IST|Sakshi
రూ.14 కోట్లకు న్యాయం చేశాడు: స్మిత్

పుణే: బెన్ స్టోక్స్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, అతని ప్రైజ్ టాగ్ కు తగిన న్యాయం చేశాడని రైజింగ్ పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్-10 వేలంలో అత్యధికంగా రూ. 14.5 కోట్లు  పలికిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రైజింగ్ పుణే దక్కించుకున్న విషయం తెలిసిందే. సోమవారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెన్ స్టోక్స్ శతకం బాది ఒంటి చెత్తో మ్యాచ్ గెలిపించాడు. 162 పరుగుల లక్ష్య చేదనలో  పుణే టాపర్డర్ చేతులెత్తయడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. చివర్లో రెచ్చిపోయి ఆడిన స్టోక్స్  జట్టుకు విజయానందించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంచాడు.

 మ్యాచ్ అనంతరం స్టోక్స్ పదర్శన పై స్సందించిన పుణే కెప్టెన్ స్మిత్ ' మేము చక్కని ఆరంభాన్ని అందించకున్నా ఎంఎస్, స్టోక్స్ రాణించారు. ఈ గ్రౌండ్ లో సిక్స్ లను సులభంగా కొట్టవచ్చు దీన్ని స్టోక్స్ సమర్ధవంతంగా ఉపయోగించుకున్నాడు. స్టోక్స్ దాటిగా ఆడటమే మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. గుజరాత్ ను సాధారణ లక్ష్యం (161) కట్టడి చేయడంలో బౌలర్లు కృషి ఎంతో ఉంది. మా స్పిన్ బౌలింగ్ విభాగం బలంగా లేకున్నా పేసర్లు రాణించారని, తొలి ఆరు ఓవర్లో పరుగులను కట్టడి చేశామని' స్మిత్ తెలిపాడు. మేము సరైన సమయంలో పుంజుకున్నామని భావిస్తున్నట్లు స్మిత్ పేర్కొన్నాడు. ఇంకా నాలుగు మ్యాచ్ లు ఉన్నాయని, వీటిలో రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు