వేలంలో 'టాప్' లేపారు!

20 Feb, 2017 16:54 IST|Sakshi
వేలంలో 'టాప్' లేపారు!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10వ సీజన్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో కొంతమంది క్రికెటర్లు అనూహ్య ధరలతో మెరవగా, మరి కొంతమంది మాత్రం కనీస ధరను కూడా దక్కించుకోలేక డీలా పడ్డారు. ఈ సీజన్ ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించగా, మరొ ఇంగ్లిష్ క్రికెటర్ తైమాన్ మిల్స్ రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ వేలంలో స్టోక్స్ కు రూ.14.5 కోట్లు చెల్లించి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ దక్కించుకోగా, మిల్స్ కు రూ.12 కోట్లు వెచ్చించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. మరొకవైపు భారత సీనియర్ క్రికెటర్లు ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, చటేశ్వర పూజారా, ప్రజ్ఞాన్ ఓజాలకు రెండో రౌండ్లో కూడా నిరాశే ఎదురైంది. వీరిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు.


అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..

బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)-ధర రూ. 14. 5కోట్లు- రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్
తైమాన్ మిల్స్(ఇంగ్లండ్)-ధర రూ.12 కోట్లు- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్)-ధర రూ. 5 కోట్లు- కోల్ కతా నైట్ రైడర్స్
కగిసో రబడా(దక్షిణాఫ్రికా)-ధర రూ. 5 కోట్లు-ఢిల్లీ డేర్ డెవిల్స్
పాట్రిక్ కమ్మిన్స్(ఆస్ట్రేలియా)-ధర రూ. 4.50 కోట్లు-ఢిల్లీ డేర్ డెవిల్స్
క్రిస్ వోక్స్(ఇంగ్లండ్)-ధర రూ. 4.20 కోట్లు-కేకేఆర్
రషీద్ ఖాన్(ఆఫ్ఘాన్)-ధర రూ. 4 కోట్లు- సన్ రైజర్స్ హైదరాబాద్
కరణ్ శర్మ(భారత్)-ధర రూ. 3.20 కోట్లు- ముంబై ఇండియన్స్
టి.నటరాజన్(భారత్)-ధర రూ. 3 కోట్లు-కింగ్స్ పంజాబ్
 

మరిన్ని వార్తలు