విరాట్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు

14 Sep, 2016 00:23 IST|Sakshi
విరాట్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో కేన్ విలియమ్సన్‌కు సొగసైన ఆటగాడిగా పేరుంది. అయినా కూడా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతీరుపై ఈ కివీస్ కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ను చూస్తూ ఎంతో నేర్చుకోవచ్చని కొనియాడాడు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ఆధిపత్యం ఎంతో ప్రత్యేకమైంది. అది నన్ను చాలా ప్రభావితుడ్ని చేస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఆటగాడి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు’ అని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌‌సలో మూడో స్థానంలో ఉన్న విలియమ్సన్ చెప్పాడు.

ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రూట్‌లను బిగ్ ఫోర్‌గా పరిగణిస్తున్నారు. ‘స్మిత్, రూట్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. మా అందరికీ విభిన్న శైలి ఉంది. ఎవరి సొంత శైలిని బట్టి వారు ఆడడం ఈ గేమ్‌కున్న గొప్ప అందం. అందుకే అందరికీ విజయాలున్నారుు’ అని 26 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక భారత్‌తో జరగబోయే సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని అంగీకరించాడు. తమ జట్టులోనూ ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని అతడు గుర్తుచేశాడు. స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్ కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఈ నెల 22 నుంచి జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!

‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

రానా నిర్మాణంలో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్‌

అందుకే అవతార్ ఆఫర్‌ తిరస్కరించా!!

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!