షమీ ఫోన్లు సీజ్‌

13 Mar, 2018 12:57 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీపై పలు సెక్షన్ల కింద నమోదైన కేసులో కోల్‌కతా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ మేర​కు మహ్మద్‌ షమీకి సంబంధించిన ఫోన్లను సీజ్‌ చేశారు. మరొకవైపు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నుంచి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్‌కు తిరిగొచ్చే క్రమంలో తన భర్త దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగి పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ నుంచి నగదు తీసుకున్నాడనే భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐని పోలీసులు సంప్రదించినట్లు తెలుస్తోంది.

అసలు షమీ దుబాయ్‌లో దిగాడానికి సంబంధించి ఏమైనా ఆధారాలున్నాయో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా షమీ ఫోన్లను సీజ్‌ చేసిన పోలీస్‌ అధికారులు.. విచారణను వేగవంతం చేశారు. తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్‌ జహాన్‌  పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో ఇప్పటికే బీసీసీఐ ఇచ్చే వార్షిక వేతనాల  కాంట్రాక్ట్‌ను షమీ కోల్పోయాడు.

>
మరిన్ని వార్తలు