సిడ్నీ: లంచ్ సమయానికి భారత్ స్కోరు: 73/1

10 Jan, 2015 07:29 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ ఆరంభమైన చివరి టెస్టులో ఐదవ రోజు రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ లంచ్ విరామ సమయానికి 29.0 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. 349 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదవ రోజున 13.2 ఓవర్లలో 48 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 16 ; 3ఫోర్లు)తో లయోన్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గెలుపే లక్ష్యంగా సాగుతున్న భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోవడంతో క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. అయితే రాహుల్ భాగస్వామ్యంతో బరిలోకి దిగిన మురళీ విజయ్ (77 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్గా క్రీజులో ఉన్నాడు . రోహిత్ శర్మ (57 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా, ఆసీస్ బౌలర్ లయోన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించాలంటే భారత్ ఇంకా 276 పరుగులు చేయాల్సివుంది.

అంతకముందు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 251/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగో టెస్ట్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది.

>
మరిన్ని వార్తలు