అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీకి నిఖత్‌

31 Jan, 2017 00:26 IST|Sakshi
అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీకి నిఖత్‌

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ బల్గేరియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికైంది. ఫిబ్రవరి 20న మొదలయ్యే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టును ప్రకటించారు. మహిళల విభాగంలో ఐదుగురు, పురుషుల విభాగంలో పదిమంది బాక్సర్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. నిఖత్‌ జరీన్‌ 51 కేజీల విభాగంలో పోటీపడుతుంది.

మీనా కుమారి (54 కేజీలు), ప్రీతి బెనివాల్‌ (60 కేజీలు), జ్యోతి (64 కేజీలు), మోనికా సౌన్‌ (75 కేజీలు) మిగతా సభ్యులుగా ఉన్నారు. పురుషుల విభాగంలో గువాహటిలో గత నెలలో జరిగిన సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిని ఈ టోర్నీకి ఎంపిక చేశారు. పది మందితో కూడిన జట్టులో రియో ఒలింపియన్స్‌ శివ థాపా (60 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు) ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు