ధోనీ బెస్ట్ వికెట్ కీపర్ కాదు..!

21 May, 2016 10:54 IST|Sakshi
ధోనీ బెస్ట్ వికెట్ కీపర్ కాదు..!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్రస్తుతం తొమ్మిదో సీజన్ నడుస్తోంది. అయితే ప్రతీ ఏడాది అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్ల వీరుడికి పర్పుల్ క్యాప్ ప్రదానం చేస్తూ బ్యాట్స్ మన్, బౌలర్లలో మరింత జోష్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో బెస్ట్ వికెట్ కీపర్ ఎవరన్న విషయంపై చాలా మందికి అవగాహనా ఉండదు. ఎందుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికొస్తే భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కచ్చితంగా ప్రస్తావించి తీరాల్సిందే. అదే ఐపీఎల్ బెస్ట్ వికెట్ కీపింగ్ రేసులో మహీ వెనకపడ్డాడు. ఐపీఎల్ 8 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మహీ ప్రస్తుతం రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ లో కొనసాగుతున్నాడు.

గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో బెస్ట్ కీపర్ గా నిలిచాడు. అయితే దినేష్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు. కార్తీక్ ఓవరాల్ గా 97 మందిని ఔట్ చేయడంలో ఓ చేయి వేయగా, అందులో 71 క్యాచ్ లు, 26 స్టింపింగ్స్ ఉన్నాయి. ధోనీ 142 మ్యాచులు ఆడగా 89 మందిని మాత్రమే ఔట్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ 62 క్యాచ్ లు పట్టగా, 27 మందిని స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. ఈ సీజన్లో కార్తీక్ మూడు అర్ధ శతకాలతో పాటు ఓవరాల్ గా 280 రన్స్ చేయగా, 13 మ్యాచులాడిన ధోనీ 220 పరుగులు చేశాడు. మహీ హాఫ్ సెంచరీల ఖాతా తెరవకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు