పాక్ జట్టులో రభస.. ఫీల్డింగ్ కోచ్ రాజీనామా

18 Feb, 2015 15:14 IST|Sakshi

మెల్బోర్న్: వివాదాలకు మారుపేరయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్లోనూ తన తీరు మార్చుకోలేదు. ఆస్ట్రేలియాలో ఇటీవల ఘర్షణపడ్డ  పాక్ ఆటగాళ్లు.. తాజాగా సొంత ఫీల్డింగ్ స్టాఫ్తోనే దురుసుగా ప్రవర్తించారు. పాక్ క్రికెటర్లు అక్మల్, అఫ్రీది, షెహజాద్ గొడవపడి దూషించడంతో మనస్తాపానికి గురైన ఫీల్డింగ్ కోచ్ గ్రాంట్ లూడెన్ పదవి నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు.  

లూడెన్ ఆటగాళ్ల ప్రవర్తన గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ప్రాక్టీసు సెషన్ సందర్భంగా ఆఫ్రిది,  షెహజాద్, ఉమర్ అక్మాల్ తనను దూషించారని లుడెన్ బోర్డుకు తెలియజేశాడు. అనంతరం పదవికి రాజీనామా చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. టీమిండియాతో మ్యాచ్ కు ముందు కూడా పాక్ ఆటగాళ్లు క్రమశిక్షణ ఉల్లంఘించారు. షాహిద్ ఆఫ్రిది సహా 8 మందికి జట్టు మేనేజ్ మెంట్ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు