శతక్కొట్టిన ప్రణీత్

11 Aug, 2016 12:04 IST|Sakshi

హైదరాబాద్:  బ్యాట్స్‌మెన్ పి. ప్రణీత్ రెడ్డి (310 బంతుల్లో 187; 26ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో కదం తొక్కడంతో ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎవర్ గ్రీన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాతి జట్టు భారీ స్కోరు చేసింది. బుధవారం రెండో రోజు ఆటలో గుజరాతి జట్టు 129 ఓవర్లలో 9 వికెట్లకు 519 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రణీత్‌తో పాటు రాహుల్ (74), కమల్ (42) ఆకట్టుకోగా... ఎవర్‌గ్రీన్ బౌలర్ చందన్ 6 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఎవర్ గ్రీన్ జట్టు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. చందన్ సహాని (83), రోహన్ (64 బ్యాటింగ్) ఆకట్టుకున్నారు.


 ఇతర మ్యాచ్‌ల వివరాలు
 ఎంపీ కోల్ట్స్: తొలి ఇన్నింగ్స్ 227; రెండో ఇన్నింగ్స్ 2/1; కేంబ్రిడ్జ్ ఎలెవన్: తొలి ఇన్నింగ్స్ 341 (తనయ్ 89, అనురాగ్ 48, చంద్రశేఖర్ 95; ఆకాశ్ 5/37)


 ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: తొలి ఇన్నింగ్స్ 137, రెండో ఇన్నింగ్స్ 141 (వంశీ కృష్ణ 79; లలిత్ మోహన్ 5/45); కాంటినెంటల్: తొలి ఇన్నింగ్స్ 63 (సుధాకర్ 4/13), రెండో ఇన్నింగ్స్ 45/2.


 గౌడ్స్ ఎలెవన్ : తొలి ఇన్నింగ్స్ 273; జెమిని ఫ్రెండ్స్: 315/8 (హెచ్.కె. సింహా 77, రాధ కృష్ణ 142, అబ్దుల్ ఖురేషి 37 బ్యాటింగ్)
 స్పోర్టింగ్ ఎలెవన్: 281/3 (రమేశ్ 73, చిరాగ్ 96, అంకుర్ 71 బ్యాటింగ్, చైతన్య 33బ్యాటింగ్); దయానంద్‌తో మ్యాచ్.

మరిన్ని వార్తలు