పుణే మ్యాచ్ కు ఊతప్ప దూరం

3 May, 2017 19:54 IST|Sakshi
పుణే మ్యాచ్ కు ఊతప్ప దూరం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రైజింగ్ పుణే

కోల్ కతా: ఐపీఎల్ లో భాగాంగా కోల్ కతా ఈడేన్ గార్డెన్స్ లో జరగతున్న మ్యాచ్ లో రైజింగ్ పుణే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  ఈ మ్యాచ్ కు కోల్ కతా బ్యాట్స్ మన్ రాబిన్ ఊతప్ప దూరమయ్యాడు. ఇతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. హైదరాబాద్ తో ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలని భావిస్తుంది.

ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది.  దీంతో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్‌ తర్వాత పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇక గత మ్యాచ్ లో బెన్ స్టోక్స్ దూకుడు బ్యాటింగ్ తో గట్టెక్కిన రైజింగ్ పుణే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. కోల్ కతా తో నెగ్గి ప్రథమార్థంలో ఓటమికి ప్రతీకారం తీసుకోవాలని భావిస్తుంది.
 

తుది జట్లు
కోల్ కతా నైట్ రైడర్స్:సునీల్ నరైన్, గంభీర్ (కెప్టెన్), మనీష్ పాండే, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, జాక్సన్, డి గ్రాండ్ హోమ్, క్రిస్ వోక్స్, కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్.

రైజింగ్ పుణే: రహానే, రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఎంఎస్ ధోని, బెన్ స్టోక్స్, తివారీ, క్రిస్టియన్, వాషింగ్టన్ సుంధర్, తాకుర్, ఉనాద్కత్, ఇమ్రాన్ తాహీర్,

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా