సచిన్ డ్రైవింగ్ ‘తలనొప్పి’

29 May, 2015 08:42 IST|Sakshi
సచిన్ డ్రైవింగ్ ‘తలనొప్పి’

న్యూఢిల్లీ : కార్లు అంటే సచిన్‌కు చాలా ఇష్టమనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ సారి ఓ కారు వల్ల సచిన్, అతని భార్య అంజలి రోజంతా తలనొప్పితో బాధపడ్డారట. ‘కొన్నేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో బిఎండబ్ల్యూ వాల్లు నాకో లిమిటెడ్ ఎడిషన్ కారు ఇచ్చారు. బ్రేక్‌లు పరీక్షించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని కోరారు. నేను అంజలి కలిసి కారులో వెళ్లాం. చాలా వేగంగా నడిపాను. ఎంత స్పీడ్ అనేది మాత్రం చెప్పను. బ్రేక్‌లు పరీక్షించడం కోసం ఒక్కసారిగా బ్రేక్ వేశాను. ఆ వేగంలో కారు ఆగడంతో మా ఇద్దరికీ తలనొప్పి మొదలైంది. ఓ రోజంతా అది తగ్గలేదు’ అని చెప్పాడు.

 నిరంతరం కష్టపడాలి : అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే నిరంతరం కష్టపడాలని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్లు కొత్త బంతులతో సిద్ధమై వస్తున్నారు. కాబట్టి బ్యాట్స్‌మెన్ నిరంతరం శ్రమిస్తేనే వారిని ఎదుర్కోగలుగుతారు’ అని సచిన్ సూచించాడు. మలింగను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నకు స్పందిస్తూ... ‘బాల్ కాదు బాల్ చూసి ఆడాలి (అతని జట్టు కాదు బంతి చూసి ఆడాలి) అంటూ మాస్టర్ చమత్కరించాడు.

>
మరిన్ని వార్తలు