భారత్ సెమీస్‌కు వెళ్తుంది: సచిన్

13 Feb, 2015 00:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లలో భారత్ కూడా ఉంటుందని దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అన్నాడు. మిగతా మూడు జట్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలను మాస్టర్ ఎంపిక చేశాడు. అయితే ఈ మెగా ఈవెంట్‌లో కెప్టెన్ ధోని పాత్ర అత్యంత కీలకం కానుందన్నాడు.
 
  ‘టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే జట్టు మొత్తం రాణించాల్సిందే. అయితే మహీ అనుభవం, నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుంది. పదేళ్ల నుంచి ధోని చాలా నిశ్శబ్దంగా విజయాలు సాధిస్తున్నాడు. ఎంత పెద్ద ఈవెంట్ అయినా అతను ఏమాత్రం ఆవేశపడడు. ఓ నాయకుడి నుంచి ఆశించాల్సింది ఇదే. సారథితో ఎప్పుడూ ఇబ్బంది ఉండకూడదు. కెప్టెన్సీతో పాటు ఫామ్‌లో కూడా ఉండాలి. అప్పుడే జట్టు ముందుకెళ్లగలుగుతుంది. ఒక్కడి వల్ల ట్రోఫీని గెలవడం అసాధ్యం’ అని మాస్టర్ పేర్కొన్నాడు.  గతంతో పోలిస్తే ప్రస్తుతం పాక్ జట్టులో నిలకడ లోపించిందని  మాస్టర్ వెల్లడించాడు.
 

మరిన్ని వార్తలు