అఫ్రిది ‘గేమ్‌ చేంజర్‌’ 

4 Apr, 2019 02:49 IST|Sakshi

పాక్‌ క్రికెటర్‌ ఆటోబయోగ్రఫీ 

కరాచీ: పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ‘గేమ్‌ చేంజర్‌’ పేరుతో వస్తున్న ఈ ఆటోబయోగ్రఫీ ఈ నెల 30న విడుదలవుతుంది. పాత్రికేయుడు వజాహత్‌ ఖాన్‌తో కలిసి అఫ్రిది ఈ పుస్తకాన్ని రాశాడు. 16 ఏళ్ల వయసులో 1996లో తన తొలి ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (37 బంతుల్లో) నమోదు చేసిన అఫ్రిది అరంగేట్రం సంచలన రీతిలో మొదలైంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు కెరీర్‌లో విధ్వంసకర ఆటగాడిగా అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పాకిస్తాన్‌ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20లు ఆడటంతో పాటు మూడు ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.   

మరిన్ని వార్తలు