‘లబ్ధిదారుల’ జాబితాలో గవాస్కర్, రవిశాస్త్రి

18 Dec, 2014 00:36 IST|Sakshi
‘లబ్ధిదారుల’ జాబితాలో గవాస్కర్, రవిశాస్త్రి

సుప్రీంకోర్టుకు అందజేసిన బీసీసీఐ
 తీర్పు రిజర్వ్ చేసిన ఉన్నత న్యాయస్థానం


 న్యూఢిల్లీ: ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌లతో లాభం పొందుతున్న బోర్డు పరిపాలకులు, ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ బుధవారం సుప్రీంకోర్టు ముందుంచింది. మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, గంగూలీ, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, లాల్‌చంద్ రాజ్‌పుత్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ ఈ ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ జాబితాలో ఉన్నారు. విచారణ సందర్భంగా మొత్తం 12 మంది పేర్లను బోర్డు న్యాయవాది సీఏ సుందరమ్ కోర్టుకు అందజేశారు. వీరికి బోర్డుతో పాటు ఐపీఎల్, చాంపియన్స్ లీగ్‌తో రకరకాల సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు బీసీసీఐ అందజేసిన జాబితాతో తప్పులు ఉన్నాయని బీహార్ క్రికెట్ సంఘం న్యాయవాది నళిని చిదంబరం కోర్టుకు విన్నవించారు.
 

 మరోవైపు బీసీసీఐలోగానీ, ఐపీఎల్‌లోగానీ తనకు పరిపాలన పాత్ర లేదని గవాస్కర్ అన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై బుధవారం చివరి దశ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌కు సంబంధించిన తీర్పును రిజర్వ్‌లో ఉం చింది. ఈ వారాంతం నుంచి కోర్టుకు శీతాకాలం సెలవులు ఉండటంతో జనవరి 5 తర్వాత దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు