కుమార్తెను వేధించవద్దన్నందుకు దాడి

31 Oct, 2017 11:44 IST|Sakshi

ప్రశ్నించిన తండ్రి, బంధువులపై దాడులు

దుకాణాలపై పడి ఆస్తులు ధ్వంసం 

ఇబ్రహీంపట్నంలో భయానక వాతావరణం

ఇబ్రహీంపట్నం: మైనర్‌ బాలికను ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించిన కుటుంబసభ్యులపై దాడి చేసిన సంఘటన సోమవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై బాలిక తండ్రి, బంధువులపై దాడికి దిగడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సీఐ స్వామి కథనం ప్రకారం... నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికను ప్రతినిత్యం స్థానిక బస్టాండ్‌లో ఇమ్రాన్‌ (23) ముష్రాఫ్‌(22)లు వేధింపులకు గురిచేస్తుండేవారు. దీంతో ఆ బాలిక తన తండ్రి నజిరుద్దీన్‌కు ఈ విషయం చెప్పడంతో బస్టాండ్‌లో ఆ యువకులను హెచ్చరించి వెళ్లిపోయారు. అనంతరం ఇమ్రాన్, ముష్రాఫ్‌లు మరికొంత మంది యువకులతో కలిసి వచ్చి స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా సమీపంలో ఉన్న నజిరుద్దీన్‌కు చెందిన ఏపీ బోర్‌వెల్స్, అతని సోదరుడికి చెందిన ఎస్‌ఎస్‌ ఎర్త్‌ మూవర్స్, స్పేర్‌ పార్ట్స్‌ దుకాణాలపై, అక్కడున్న వారిపై ఇనుపరాడ్‌లతో దాడి చేశారు.

దుకాణంలోని ఆయిల్‌ డబ్బాలు పగిలి రోడ్లపై ఏరులైపారాయి. ఈ సందర్భంగా అక్కడున్న నజిరుద్దీన్‌తోపాటు అతని బంధువులైన ఎండీ ఇర్షాద్‌(25), సోహైల్, (21)వాజిద్‌(22) ఎండీ రషీద్‌లు గాయపడ్డారు. కాసేపు ఆ ప్రాంతంలో భయానక వాతావారణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా.., మిగతా వారు పరారయ్యారు. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో ఆయిల్‌ డబ్బాలు పగిలి రోడ్లపై రోడ్డుపై పారుతుండటంతో ద్విచక్ర వాహనాలు జారి పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు జేసీబీతో మట్టి తెప్పించి రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాలిక తండ్రి నజిరుద్దీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

చదువుతో పాటు.. ఉద్యోగం

మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్‌

ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమికులు

అత్తను చంపిన కోడలు అరెస్ట్‌

వైద్యం అందక చిన్నారి మృతి

ఎడ్లబండే 108 

గుట్టుచప్పుడు కాకుండా ..

వీళ్లు ఇక మారరు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ