జీఎస్టీతో మనకు లాభమే

17 Apr, 2017 01:06 IST|Sakshi
జీఎస్టీతో మనకు లాభమే

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల వెల్లడి
పన్ను వాటా పెరుగుతుందని ఆశిస్తున్నాం
నష్టపోయే రాష్ట్రాలకు ఐదేళ్లపాటు కేంద్రం పరిహారం
మన ప్రయోజనాలు, ఆదాయానికి గండి పడకుండా చూస్తున్నాం
మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు
వస్తు సేవల పన్ను బిల్లుకు అసెంబ్లీ ఆమోదం  


సాక్షి, హైదరాబాద్‌: ఒక దేశం ఒకే పన్ను నినాదంతో అమల్లోకి తెస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు, ఆదాయానికి గండి పడకుండా తదనుగుణంగా స్పందిస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ పన్ను విధానం పారదర్శకంగా ఉంటుందని, కొత్త విధానం వల్ల రాష్ట్రం కోల్పోయే ఆదాయం మొత్తాన్ని ఐదేళ్లపాటు కేంద్రం పరిహారం రూపంలో రీయింబర్స్‌ చేస్తుందని శాసనసభలో వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రానికి లాభమేనన్నారు. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందన్నారు. వస్తు సేవల పన్ను బిల్లుకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. అంతకుముందు సభలో బిల్లును ప్రవేశపెట్టిన ఈటల జీఎస్టీ స్వరూప స్వభావాలను సభ ముందుంచారు.

జీఎస్టీ స్లాబ్‌లపై ఇంకా స్పష్టత లేదు
వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను ఉండదని, మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో ఉండవని చెప్పారు. ప్రత్యక్ష పన్ను అయిన ఆదాయపు పన్ను జీఎస్టీ పరిధిలోకి రాదని, పరోక్ష పన్ను అయినప్పటికీ కస్టమ్స్‌ సుంకం కూడా దీని పరిధిలో ఉండదన్నారు. సామాన్యుడిపై భారం పడకుండా పన్ను విధానం ఉండాలని, పన్ను విధింపు ప్రాక్టి కల్‌గా ఉండాలని పలు సందర్భాల్లో నిర్వహిం చిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాల్లో తెలంగాణ పక్షాన గట్టిగా వాణిని వినిపించామన్నారు.

ఇప్పుడు అదే పంథాలో పన్ను విధానం ఉంటుందని ఆశిస్తున్నామ న్నారు. అయితే జీఎస్టీలో ఏ వస్తువు ఏ పన్ను స్లాబ్‌ పరిధిలో ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రావా ల్సి ఉందని ఈటల పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వస్తువులపై విధిస్తున్న వ్యాట్, దానికి అనుబంధంగా ఉన్న సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం కలిపి ఆ మొత్తం ఏ స్లాబ్‌కు చేరువలో ఉందో చూసి అందులో చేరుస్తారని తెలిపారు.

ఉత్పత్తి కంటే వినియోగం అధికంగా ఉన్న రాష్ట్రం అయినందున జీఎస్టీలో తెలంగాణకు ఎక్కువ పన్ను మొత్తం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే హైదరాబాద్‌లో సేవల రంగం వాటా ఎక్కువగా ఉన్నందున ఆ రూపంలో ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్పారు. కొత్త పన్ను విధానం వల్ల ఎగవేతలకు బ్రేక్‌ పడి ఆదాయం పెరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రపం చంలో 196 దేశాలకుగాను ఇప్పటికే 160 దేశాలు ఈ పన్ను విధానాన్ని అవలంబిస్తు న్నాయని సభ దృష్టికి తెచ్చారు.

రియల్‌ ఎస్టేట్‌ను జీఎస్టీలోకి తేవాలి: చిన్నారెడ్డి
పట్టణాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం భారీ ఆదాయాన్ని తెచ్చేపెట్టేదిగా మారనున్నం దున దాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలని కాంగ్రెస్‌ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు. ఇప్పటి వరకు రియల్‌ ఎస్టేట్‌తోపాటు విద్యుత్‌ విషయంలో పన్ను విధింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవటానికి కారణ మేంటని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌ పక్షాన ఆయన చర్చలో పాల్గొ న్నారు.

ఒకే దేశం ఒకే పన్ను విధానం అన్నప్పుడు పన్ను విధింపుల్లో రకరకాల స్లాబులెందుకని ప్రశ్నించారు. భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తారంటున్నారని, దానిపై స్పష్టత కావాల న్నారు. విలాసవంతమైన ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులను పెద్ద స్లాబ్‌లోకి చేర్చి సామాన్యులు వాడే వస్తువులను తక్కువ పన్ను స్లాబ్‌లోకి మార్చాలని కోరారు.

>
మరిన్ని వార్తలు