వేడినీళ్లలో పడి చిన్నారి మృతి

1 Mar, 2020 08:38 IST|Sakshi

సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్‌) : ఆభం శుభం తెలియని ఓ పసివాడు ఆడుకుంటూ వేడినీళ్లపైపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద సంఘటన అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా గ్రామపంచాయితీ పరిధిలోని బాలునాయక్‌తండాలో నెలకొంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్‌ శ్రీనివాస్‌–ముని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అందులో చిన్న కుమారుడు ధరావత్‌ సాయికుమార్‌(4) స్నానం కోసం ఉడుకుతున్న వేడినీళ్లు మీద పడి మృతి చెందాడు. ఈ నెల 26న ఇంటి ముందు పొయిపై మరుగుతున్న వేడినీళ్లపై ఆడుకుంటూ అటూగా వెళ్లిన బాలుడు గిన్నెపై పడ్డాడు. దీంతో ఆ బాలుడుకి ఒంటిపై వేడినీళ్లు పడి చర్మం తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన తల్లిదండ్రులు ముందట హుస్నాబాద్‌  ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రిఫర్‌ చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయికుమార్‌ మృతి చెందడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. నీన్నే చూస్తూ బతుకుతున్నం కొడుకా.....నాలుగేళ్లకే నూరేల్లు నిండాయా కొడుకా...ఇగ మేము ఎవరి కోసం బతకాలి బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు