బోస్టన్‌ నమూనాలో కృష్ణా బ్రిడ్జి నిర్మాణం

19 May, 2017 02:20 IST|Sakshi
బోస్టన్‌ నమూనాలో కృష్ణా బ్రిడ్జి నిర్మాణం

రూ. 140 కోట్లు మంజూరు.. ఈ వారంలో టెండర్‌
వెంటనే పనులు చేపట్టనున్న ఎన్‌హెచ్‌ అధికారులు


కృష్ణా(మక్తల్‌): మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండల సరిహద్దులో గల కృష్ణానదిపై ఉన్న బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు సమాచారం. ఆ బ్రిడ్జి కూడా అమెరికాలోని బోస్టన్‌ బ్రిడ్జి ఆకారంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఎన్‌హెచ్‌–167గా గుర్తింపు పొందింది. గతేడాది రూ. రూ.4.87 కోట్లతో మరమ్మతు చేపట్టారు. అయితే,వాహనాల రద్దీ పెరగడం, వాహనచోదకులకు ఈ బ్రిడ్జిపై ప్రయాణం ఉపయోగంగా లేదని ఇంజనీర్లు నేషనల్‌ హైవే అధి కారులకు సూచించారు.

దీంతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. బ్రిడ్జి నిర్మా ణానికి ఇప్పటికే రూ.140 కోట్లు విడుదల చేసినట్లు ఎన్‌హెచ్‌ అధికారులు తెలి పారు. దీనికి ఈ వారంలో టెండర్లు పిలిచే అవకా శం ఉందన్నారు. బోస్టన్‌ బ్రిడ్జికి 10 స్తం భాలు ఉంటాయని, అవి ఒకే వరుసలో ఉం టూ ప్రజలను ఆకర్షించేవిధంగా ఉంటా యని పేర్కొన్నారు. భారతదేశంలో దీని మాదిరిగా ఎక్కడా లేదని  తెలిపారు.

>
మరిన్ని వార్తలు