చప్పట్లు కొట్టింది ఇందుకేనా!

25 Mar, 2020 02:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైద్యులకు అద్దె ఇల్లు ఖాళీ చేయిస్తున్న యజమానులు

సోషల్‌ మీడియాలో ఓ వైద్య విద్యార్థి ఆవేదన

ఎంజీఎం: కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో తనలాంటి వారికి ఇంటి యజమానులు ఖాళీ చేయిస్తున్నారని ఓ వైద్య విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశాడు. మరికొందరైతే దూషిస్తున్నారని వాపోయాడు.‘అతి భయంకరమైన కరోనా బారిన పడే వారికి వైద్య సేవలందిస్తున్నాం.. ప్రాణాలను పణంగా పెట్టి జాతి శ్రేయస్సు కోసం సేవలం దిస్తున్నాం. కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నామని ఒకే కారణంగా అద్దె ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు.. మా కోసం చప్పట్లు కొట్టింది ఇందుకేనా..? అంటూ వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌ విధులు నిర్వర్తిస్తున్న  వైద్య విద్యార్థి సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. 

వసతి సౌకర్యం సరిపోక అద్దె గదుల్లో..
వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ)లో 200 మంది మెడికల్‌ విద్యార్థులు ఎంజీఎం ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారన్నాడు. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు కేఎంసీ కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నారని తెలిపాడు. వీరు ఎంజీఎం ఆస్పత్రిలోని కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్న నేపథ్యం లో ఇంటి యాజ మానులు వారిని ఖాళీ చేయిస్తున్నారని తమ ఆవేదనను సోషల్‌ మీడియాలో వెళ్లగక్కారు. కాగా, కేఎంసీలోనే 50 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పిస్తామని, వైద్యవిద్యార్థులు ఎలాంటి ఆవేదన చెందాల్సిన అవసరం లేదనికేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు