జూలై2న ముంబైకి రవాణాశాఖ బృందం

26 Jun, 2014 03:31 IST|Sakshi
  •      ట్రాఫిక్ వ్యవస్థ అధ్యయనం
  •      మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన
  •      అక్కడి మెరుగైన విధానాలు గుర్తించి హైదరాబాద్‌లో అమలు
  • సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా మారిన హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో ఓ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ముంబైలో పరిస్థితుల అధ్యయనానికి వెళ్తోంది. జూలై 2న రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నేతృత్వంలో బృందం అక్కడికి వెళ్తోంది.

    ఇందులో సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగం, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీల నుంచి ఉన్నతాధికారులు ఉంటారు. ఈమేరకు బధవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, రవాణాశాక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రాలతో భేటీ అయ్యారు. ఆయా విభాగాల నుంచి ఎవరెవరు వస్తారో ఎంపిక చేసి తనకు తెలపాలని ఆదేశించారు.
     
    ‘నగరంలో ట్రాఫిక్ గందరగోళంగా మారింది. ఇక్కడి కంటే వాహనాలు, జనాభా అధికంగా ఉన్న ముంబైలో ప రిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడి యంత్రాంగం అం దుకు తీసుకుంటున్న చర్యలేంటో పరిశీలిస్తాం. సిటీ బస్సు ల నిర్వహణ, అవి బస్టాప్‌లలో నిలిచేతీరు, ప్రయానికులు క్యూ పద్ధతిని అనుసరించటం, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, జీబ్రా క్రాసింగ్స్, ప్రజలు నిబంధనలు పాటించటంలో అ ధికారులు చేస్తున్న కృషి... తదితర అంశాలను పరిశీలి స్తాం. వాటిని హైదరాబాద్‌లో ఎంతవరకు అమలు చేయ చ్చో గుర్తించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తాం’ అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.
     
    ‘నెంబర్ ప్లేట్ల’పై త్వరలో ఉత్తర్వులు...

     తెలంగాణకు టీఎస్ రిజిస్ట్రేషన్ సీరీస్ కేటాయించిన నేపథ్యంలో ఏపీ సీరీస్‌తో ఉన్న పాత వాహనాల నెంబర్ ప్లేట్లను కూడా కొత్త సీరీస్‌లోకి మార్చాల్సిందేనని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని, అవి పూర్తి కాగానే ముఖ్యమంత్రితో చర్చించి ఆమోదం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.
     

మరిన్ని వార్తలు