శునక బాంధవ్యం..!

16 Mar, 2015 08:40 IST|Sakshi
శునక బాంధవ్యం..!

వేమనపల్లి : ఇదేంటీ ఎడ్లబండి మధ్యలో కుక్క ఉంది అనుకుంటున్నారా..! అవును ఆ బండి మధ్యలో కుక్క ఉంటేనే ఎడ్లకూ మనిషికీ ధైర్యం మరి. మనిషికి కూడా కుక్కకు ఉన్న విశ్వాసం ఉండదంటారు. యజమాని పెట్టే బుక్కెడు బువ్వకు ఆ కుక్క కాపలా ఉంటూ విశ్వాసం చూపుతోంది. మండల కేంద్రమైన వేమనపల్లికి చెందిన పర్షబోరుున బాపు ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్కతో ఇంటి వారికి విడదీయరాని అనుబంధం ఉంది. రాత్రింబవళ్లు ఇంటి వద్ద కాపలా ఉంటోంది. ఎవరు ఉన్నా లేకున్నా కాపలా కాస్తుంది. కుక్కను మల్లేషు అని పిలుచుకుంటారు. ఇంటి వాళ్లు పిలవగానే క్షణాల పరుగెత్తుకుంటూ వస్తుంది. అడవిలో ఎలుగుబంట్లు, వన్యమృగాల భయం ఎక్కువగా ఉండడంతో బాపు వంట చెరుకు కోసం అడవికి వెళ్తే వెంట వెళ్తుంది. ఇలా ఎడ్లబండి మధ్యలో ఎప్పుడూ ప్రయూణిస్తూనే ఉంటుంది.

మరిన్ని వార్తలు