'ఆరోపణలు వాస్తవం కాకుంటే కేసులు పెట్టండి'

18 Sep, 2014 08:45 IST|Sakshi

హైదరాబాద్ : తన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వమే స్పందించాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఆరోపణలు వాస్తవం కాకుంటే తనపై కేసులు పెట్టుకోవచ్చిని ఆయన గురువారం ఓ ఛానల్ కార్యక్రమంలో అన్నారు. భూతగాదాల వల్ల ఎల్అండ్టీ అసంతృప్తిగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

సర్కార్ ప్రోత్సహంతోనే ఎల్అండ్టీ భూములను వెనక్కి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలుకు గచ్చిబౌలిలో కేటాయించిన 32 ఎకరాల విలువైన భూమిని  కేసీఆర్ తన ప్రయోజనాల కోసం మైహోమ్స్ రామేశ్వర్‌రావుకు ధారాదత్తం చేయడం వల్లనే వివాదం ఏర్పడిందని  రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. ఓ వ్యక్తి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.

మరోవైపు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత మంద జగన్నాథం మాట్లాడుతూ  రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మెట్రో డిజైన్ మార్పు చేశారన్నారు. మెట్రోపై ఎన్నికల ముందే కేసీఆర్ స్పష్టత ఇచ్చారని మంద అన్నారు.

మరిన్ని వార్తలు