బంద్ విజయవంతం

18 Jun, 2016 00:12 IST|Sakshi

కుల సంఘాల ర్యాలీలు.. కళాకారుల విన్యాసాలు
రహదారిపై వంటా వార్పు    ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు.. టైర్లకు నిప్పు

ఐదు చోట్ల రాస్తారోకోలు, మహిళా సంఘాల భారీ ర్యాలీలు

 

జనగామ : జిల్లా కోసం జనగామ దరువేసింది. 48 గంటల పాటు ఉద్యమకారుల నినాదాలతో జాతీయ రహదారి  హోరెత్తింది. పోలీసుల బలగాలు.. ఉద్యమ కారుల నిరసనలతో అట్టుడికిపోయింది. వాడవాడలా బైక్ ర్యాలీలు...కుల సంఘాల పాదయాత్రలతో జనగామ జిల్లా బంద్ విజయవంతమైంది. ఐకాస చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బంద్‌లో మంగళ్లపల్లి రాజు, ఆకుల వేణుగోపాల్‌రావు, డాక్టర్లు లక్ష్మీనారాయణ నాయక్, రాజమౌళి, గిరిమల్ల రాజు, ఆకుల సతీష్, వజ్జ పర్శరాములు, మహంకాళి హర్చింద్రగుప్త, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరత్నం, జేరిపోతు కుమార్, తిప్పారపు విజయ్, గుగ్గిళ్ల శ్రీధర్, బాల్దె మహేందర్, ధర్మపురి శ్రీనివాస్, రంగరాజు ప్రవీణ్, రంగు రవి, జక్కుల వేణు, శ్రీనుగుప్త, పి.సత్యం, తొట్టె కృష్ణ, కొయ్యడ శ్రీను, మాజీద్, తీగల సిద్దూగౌడ్, పిట్టల సురేష్, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసి వేయడంతో రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారిపోయాయి.


జిల్లా సాధన ఉద్యమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి రావాలని నినదించారు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, బీఎస్పీ, జేఏసీ, జిల్లా సాధనసమితి, ఐఎంఏ, చాంబర్ ఆఫ్ కామర్స్, టీజీవీపీతో పాటు అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులు రహదారిపై బైఠాయించి జనగామ జిల్లా చేయాలని గొంతెత్తి గర్జించారు. జిల్లా సాధన కోసం బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. మార్నింగ్ వాకర్స్, జిమ్ బిల్డర్స్ అసోసియేషన్ ర్యాలీని నారోజు రామేశ్వరాచారి ఆధ్వర్యంలో తలపెట్టగా మున్సిపల్  చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ప్రారంభించారు. మండలపరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీఏ, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయూలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జనగామ జిల్లా కోరుతూ నమాజ్ తర్వాత ముస్లింలు జమాల్‌షరీఫ్, ఎండీ. అన్వర్, దస్తగిరి, అజహరొద్దీన్, అక్భ ర్, ముజ్జులు  రైల్వేస్టేషన్ రోడ్డు జామై మజీద్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. లింగాలఘన్‌పుర్‌కు చెందిన ఒగ్గు కళాకారులు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై చేసిన వి న్యాసాలు ఆకట్టుకున్నాయి. కౌన్సిలర్ మేకల రాంప్రసాద్  ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో మూడు వేల మందికి అన్నదానం చేశారు. రెండు రో జుల బంద్‌కు సహకరించిన వారికి అరుట్ల దశమంతరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


మూడవ రోజుకు న్యాయవాదుల దీక్షలు
జనగామ జిల్లా కోసం తలపెట్టిన న్యాయవాదుల దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్ ఆధ్వర్వంలో సత్తయ్య, ఉడుత ఉపేందర్, బాల్నె సతీష్ దీక్షలో కూర్చున్నారు.

మరిన్ని వార్తలు