ఆహార ధరలు.. 5 నెలల గరిష్టం

15 Jan, 2015 01:00 IST|Sakshi
ఆహార ధరలు.. 5 నెలల గరిష్టం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2014 డిసెంబర్‌లో 0.11 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 డిసెంబర్ నెలతో పోల్చిచూస్తే గడచిన నెలలో టోకున ధరలు స్వల్పంగా 0.11% పెరిగాయన్నమాట. 2014 నవంబర్‌లో ఈ రేటు అసలు పెరగలేదు. ‘0’గా నమోదయ్యింది. అయితే ఆహార విభాగానికి సంబంధించి మాత్రం ధరలు 2014 నవంబర్‌లో 0.63% పెరిగితే, మరుసటి నెలలోనే ఈ రేటు 5.2%కి పెరిగి కూర్చుంది.

ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. బుధవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆహార ఉత్పత్తుల ధరలను మొత్తంగా చూస్తే, ఈ విభాగంలో ధరలు వార్షికంగా 5.2 % ఎగశాయి. పెరిగిన ఉత్పత్తుల ధరల్లో తృణ ధాన్యాలు (1.26%), బియ్యం (4.43%), ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపలు (0.63%), పప్పు ధాన్యాలు (5.88%), బంగాళ దుంపలు (13.76%), పండ్లు (17.87%), పాలు (9.72 %) ఉన్నాయి. కూరగాయల ధరలు 4.78 % తగ్గాయి. ఉల్లి ధరలు సైతం 18.54% తక్కువగా ఉన్నాయి. గోధుమల ధరలు కూడా 2.46% క్షీణించాయి.  
 

మరిన్ని వార్తలు