మూడేళ్ల గరిష్టంలో టోకు ధరల ద్రవ్యోల్బణం

14 Mar, 2017 12:58 IST|Sakshi
న్యూఢిల్లీ : దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టానికి ఎగిసింది. అంచనావేసిన దానికంటే పెరిగి ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం  ఏడాది ఏడాదికి 6.55 శాతంగా నమోదైంది. జనవరి నెలలో ఈ ద్రవ్యోల్బణం 5.25 శాతంగా ఉంది. మినరల్స్, ప్యూయల్ ధరలు పెరగడంతో పాటు ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో ఈ టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా పేర్కొంది. మంగళవారం ప్రభుత్వం ఈ డేటాను విడుదల చేసింది. రాయిటర్స్ పోల్స్ అంచనాల ప్రకారం ఈ డేటా 5.90 శాతంగా నమోదవుతుందని అంచనావేసింది.
 
ఈ రెండున్నర ఏళ్లలో టోకు ధరలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గత నెల టోకు విక్రయాల ఆహార ధరలు యేటికేటికి 2.69 శాతం పెరిగాయి. జనవరిలో ఇవి 0.56 శాతం పడిపోయాయి. మినరల్ ధరలు కూడా 31 శాతం పెరిగాయి. అంతేకాక సమీక్షించిన పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగియడంతో ప్యూయల్ 21 శాతం కాస్ట్ లీగా మారిందని ప్రభుత్వ డేటా వెల్లడించింది.  
 
మరిన్ని వార్తలు