సౌదీలో భారతీయుడి తల నరికివేత

31 Jan, 2014 12:50 IST|Sakshi

రియాద్: హత్యానేరంపై భారతీయ కార్మికుడొకరికి సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించారు. శిరచ్ఛేదం(తల నరికివేత) చేసి శిక్ష అమలు చేశారు. తనకు ఉపాధి కల్పించిన డాఫిర్ ఆల్-డొసరిని హత్య చేసిన భారతీయ కార్మికుడు మహ్మద్ లతీఫ్కు శిరచ్ఛేదం చేసినట్టు ఆంతరంగిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. డాఫిర్తో గొడవపడి అతడిని ఇనుప రాడ్తో లతీఫ్ కొట్టి చంపాడు. తర్వాత డాఫిర్ మృతదేహాన్ని గొతిలో పూడ్చిపెట్టాడు.

కేసు విచారించిన స్థానిక న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. అయితే మృతుడి కుమారులు పెరిగి పెద్దవారయి శిక్ష ఆమోదించాలన్న అభ్యర్థనతో శిక్ష అమలును గతంలో కోర్టు వాయిదా వేసింది. గురువారం శిక్ష అమలు చేశారని సౌదీ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలో మొత్తం ముగ్గురు నేరస్థులకు శిరచ్చేదం చేశారు. హత్య, అత్యాచారం, దోపిడీ, మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధిస్తారు.

>
మరిన్ని వార్తలు